Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలనచిత్ర పరిశ్రమ అభివద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బిఆర్కే భవన్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివద్ధి, సినీ ఎగ్జిబిటర్ల సమస్యలు, ఇతర అంశాలపై మంత్రి తలసాని చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌తో కలిసి అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీ మోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు సి. కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్న కుమార్ తదితరులతోపాటు పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ,'సినీ పరిశ్రమకి అన్ని విధాలుగా అనువుగా ఉన్న హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నాం. అలాగే టికెట్ల విక్రయాలలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నాం. దీనివల్ల తక్కువ సర్వీస్ ఛార్జీతోనే ప్రేక్షకులు టికెట్‌ను పొందే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సైట్లు ఒక్కో టికెట్‌కు 20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఎఫ్డిసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్లైన్ టికెట్ విధానంలో ఒక్కో టికెట్‌కు కేవలం 6 రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జ్జీ ఉంటుంది. లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూసివేసి ఉన్నందున ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్నుని రద్దు చేసి ఆదుకోవాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించాలని తదితర విజ్ఞప్తులతో సినీ ఎగ్జిబిటర్స్ వినతిపత్రాన్ని అందజేశారు. అందులో పార్కింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతించింది. మిగిలిన అంశాలను ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం. ప్రస్తుతం 4 షోలు రన్ అవుతున్నాయి. 5వ షో ప్రదర్శనకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగల్ ఇచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది.