Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్.కె.ఎంట్రప్రైజస్ పతాకంపై సిరాజ్ అహ్మద్ సమర్పణలో షమీమ్ అహ్మద్, మహ్మద్ ఖాదర్ జిలాని నిర్మిస్తున్న హిలేరియస్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ 'హౌలా'. బాలీవుడ్ దర్శకుడు కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డెక్కన్ సూపర్ స్టార్ అద్నాన్ సాజిద్ ఖాన్ (గుల్లు దాదా), ప్రీతి నిగమ్, సనా ఖాన్, అజీజ్ రిజ్వాన్, నిషా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం హైద్రాబాద్‌లోని సెన్సేషన్ థియేటర్లో వైభవంగా ప్రారంభమైంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో సయ్యద్ హుస్సేన్‌తోపాటు బాలీవుడ్ నాయిక హీనా షేక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ, ''హౌలా' ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం. ఇప్పుడిప్పుడే మెల్లగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి డెక్కన్ సినిమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమకు మరిన్ని రాయితీలివ్వాలి. అప్పుడు హైదరాబాద్ హిందీ సినిమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది' అని చెప్పారు.
'హౌలా' సినిమాలోని పాత్రలన్నీ సీరియస్‌గా ఉంటాయి. కానీ ఆ పాత్రల సీరియస్‌నెస్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత' అని దర్శక, నిర్మాతలు తెలిపారు.