Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్వక్సేన్ హీరోగా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'పాగల్'. నివేదా పేతురాజ్ కథానాయిక. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విష్వక్ సేన్ తండ్రి, 'ఫలక్‌నుమాదాస్' నిర్మాత రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా విష్వక్ సేన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాని చాలా రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నాం. అందరం ప్రేమించి సినిమా చేశాం. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమ గురించి చెప్పే కథ. ఇందులో మదర్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అమ్మగా భూమికగారు అద్భుతంగా చేశారు. చాలా మంది నన్ను లవ్‌స్టోరీ చేయమని అంటుంటే.. నేను ఏకంగా ఐదు లవ్‌స్టోరీస్ ఉండే సినిమాని చేశాను' అని తెలిపారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'ఈనెల 14న వరల్డ్‌వైడ్‌గా మా సినిమాని విడుదల చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, చెన్నై, యు.ఎస్‌లలో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు అన్ని సెంటర్స్‌లోనూ సినిమాని విడుదల చేస్తున్నాం. దిల్‌రాజుగారు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ, జబర్దస్త్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.