Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రఘువరన్ బి.టెక్'లో ధనుష్ తమ్ముడిగా నటించిన రిషికేశ్ 'బొమ్మల కొలువు' చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో రిషికేశ్ మాట్లాడుతూ, 'దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో 'రుద్ర' అనే పాత్రని ఇచ్చారు. సినిమాపై మంచి ప్యాషన్ ఉన్న మా నిర్మాత ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు' అని చెప్పారు. 'పాండమిక్ సమయంలో 'రాహు' దర్శకుడు సుబ్బు చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో వెంటనే ఈ సినిమాని స్టార్ట్ చేశాం. అలాగే మల్లాద్రి అప్పన్న దర్శకత్వంలో ఓ సినిమా, భానుశర్మ దర్శకత్వంలో మరో సినిమాని చేశాం. అందరి సహకారంతో మూడు సినిమాలను ఓకేసారి పూర్తి చేశాం. ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటూ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెలలోనే ఈ మూడు సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి తెలిపారు. దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ, 'ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతూ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇది' అని చెప్పారు.