Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టాక్సీవాలా' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నాయిక ప్రియాంక జవాల్కర్. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ విడుదలైన 'తిమ్మరుసు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రాల్లోని భిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. రిలీజైన రెండు సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో ప్రియాంక తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా?, రారా అనే మీమాంస అందరిలోనూ ఉంది. అయితే వాటికి చెక్ పెడుతూ విడుదలైన 'తిమ్మరుసు', 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాల్లో నేను పోషించిన పాత్రలను అందరూ ప్రశంసిస్తున్నారు. 'టాక్సీవాలా' తర్వాత చాలా సెలెక్టీవ్‌గా స్క్రిప్ట్స్‌ని ఫైనల్ చేస్తున్నాను. అయితే 'గమనం' సినిమాలో నా పాత్ర చిన్నదే అయినప్పటికీ నాకు బాగా నచ్చడంతో అంగీకరించాను. నా సినిమాలకు నా ఫ్రెండ్సే పెద్ద క్రిటిక్స్. నేను ఎక్కడ బాగా చేశాను, ఎక్కడ మిస్ అయ్యాననే విషయాలను వాళ్ళే చెబుతుంటారు. దర్శకుడు చెప్పినట్లు చెయ్యడమే నా లక్ష్యం. వారి వల్లే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. బయట నా మీద వచ్చే నెగటివ్‌ని లైట్ తీసుకుంటాను. పాజిటివ్‌ను మాత్రమే ఎంజారు చేస్తాను. ఇప్పటి మాదిరిగానే భవిష్యత్తులోనూ మరిన్ని మంచి పాత్రల్లో నటిస్తాను. నటనతోపాటు డాన్స్‌లో కూడా బాగా చేసేందుకు కృషి చేస్తున్నా. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను. ఓటీటీల్లోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ఇలాంటి పాత్రలే చేయాలని గీత గీసుకోలేదు. నాకు నచ్చిన పాత్ర ఏదైనా సరే చేస్తాను. తమిళంలోనూ ఓ సినిమాకి సైన్ చేశాను' అని తెలిపింది.