Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌటిల్య, యాషిక నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం 'చైతన్యం'. సూర్య దర్శకత్వంలో జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్బంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ, 'ఎవరో వస్తారు, ఏదో చేస్తారని బద్దకంతో అచేతనంగా బతికితే మనిషిని, సమాజాన్ని, దేశాన్ని ఎప్పటికి ఎదగనీయదు. కానీ అందరిలా తాను అలా కాకూడదని ఓ యువకుడు బాగా గొప్పగా బతకాలని, దుబారు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో ఎదురైన అడ్డంకుల్ని ఎదుర్కొని ఎలా ముందుకు కదిలాడు అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అని చెప్పే ప్రయత్నం చేశాం. కౌటిల్య, యాషిక తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్‌తో మంచి క్వాలిటీతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.
నిర్మాతలు మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'చాలా మంచి కథ ఇది. పథకాల పేరుతో ప్రజలను ఎలా చేతకాని వాళ్ళలా మారుస్తున్నారు?, దానివల్ల ప్రజలు ఎలా తయారవుతున్నారనే పాయింట్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. చైతన్యం ఉన్నవాడు ముందడుగు వేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కథాంశంతో నిర్మించాం. ఈనెల 13న వన్ మీడియా సంస్థ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.
సుందరం, రఘునాధ,్ ఈశ్వర్ రెడ్డి, రామారావు, శివప్రసాద్, విష్ణుప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌పే,్ల డైలాగ్స్: మీరఖ్, సాహిత్యం: లక్ష్మీ భూపాల, సంగీతం: అర్జున్ రాము, కళ: మంజునాథ్ సింధేషం.