Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్ కష్ణ, వాణి విశ్వనాథ్ తనయ వర్ష విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఘరానా మొగుడు'. రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్.కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ బుధవారం మణికొండలోని శివాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైనది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత టి. రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, జెమిని సురేష్ కెమెరా స్విచాన్ చేశారు. సీనియర్ దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించగా, ఎ.ఎస్.రవికుమార్ స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ , 'మా అమ్మ వాణి విశ్వనాథ్‌గారు నటించిన 'ఘరానా మొగుడు' టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా 'రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం' విడుదలకు సిద్ధంగా ఉంది' అని చెప్పారు. నిర్మాత, హీరో మోహన్ కష్ణ మాట్లాడుతూ, 'ఇప్పటివరకు 'బావ మరదలు', 'మోహన్ కష్ణ గ్యాంగ్ లీడర్' చిత్రాలను తీశాను. ఇది మా ప్రొడక్షన్లో 3వ సినిమా. చిరంజీవిగారు నటించిన 'ఘరానా మొగుడు' టైటిల్‌తో ఈ చిత్రం తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది' అని తెలిపారు.
'నా అభిమాన నటుడు చిరంజీవిగారి 'ఘరానా మొగుడు' టైటిల్‌తో నేను దర్శకత్వం వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమకు ఓ దర్శకుడు ఎలాంటి ఆశలతో, భావాలతో వచ్చాడు?, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని, దర్శకుడిగా బాధ్యతలను నిర్వర్తించాడు?, అలాగే ఓ అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి తన జీవితంలోకి ఎదురైన తరువాత అతని ప్రయాణం ఎలా సాగింది అనేదే ఈ సినిమా' అని దర్శకుడు రాజుబాబు చెప్పారు.
రావు రమేష్, జీవి సుధాకర్ నాయుడు, భానుచందర్, ప్రసన్న కుమార్, సుధ, దేవి, కలర్స్ వాసు, గీతాసింగ్, జబర్దస్త్ అప్పారావు, పథ్వి ,బోనం బాబి, సమీర్ శర్మ ,పింగ్ పాంగ్ సూర్య, రమేష్, బాలాజీ, కీర్తి, జయశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఓ.పి : మురళి, మ్యూజిక్ :ఘనశ్యాం, స్టోరీ డైలాగ్స్ : శింగలూరి మోహన్ రావు, ఎడిటర్ :కెఎవై. పాపారావు, ఫైట్ మాస్టర్ : రామ్ సుంకర , లిరిక్స్ : శరత్ చంద్ర, డాన్స్ : రాజ బోయిన, మహేష్ స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : రాజుబాబు అచ్చరథ.