Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అర్ధనారి'లో హీరోగా, 'సౌఖ్యం'లో విలన్‌గా మెప్పించిన అర్జున్ అంబటి తాజాగా హీరోగా నటించిన చిత్రం 'సుందరి'. హీరోయిన్ పూర్ణ టైటిల్ పాత్ర పోషించింది. కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు సిద్ధమైన
ఈ సినిమా గురించి హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ, 'డైరెక్టర్ కళ్యాణ్ జి.గోగణ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ. పూర్ణ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉన్నప్పటికీ తనతో పాటు సమానమైన రేంజ్లో ఉన్న భర్త క్యారెక్టర్‌ను చేయమని అడిగారు. అలాగే నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉంటాయి. నటించడానికి మంచి స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమాని అంగీకరించాను. పల్లెటూర్లో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని సిటీకి వస్తుంది. తర్వాత ఏమవుతుంది?, భార్యాభర్తల మధ్య పరిస్థితులు ఎలా మారుతాయనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. పూర్ణ మంచి నటి. యాక్టింగ్, డాన్స్ అన్నింటిలో చక్కగా పెర్ఫామ్ చేస్తారు. నిర్మాత రిజ్వాన్‌గారు మంచి ఎన్విరాన్మెంట్లో సినిమాని పూర్తి చేశారు. 'అర్ధనారి', 'సౌఖ్యం' తర్వాత కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంత బజ్ రాలేదు. దీంతో 'అగ్నిసాక్షి' సీరియల్లో యాక్ట్ చేశాను. దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు 'దేవత' సీరియల్ చేస్తున్నాను. హీరోగానే మంచి పేరు తెచ్చుకోవాలని లేదు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. 'పుష్ప'లో ఓ రోల్ కోసం సుకుమార్ ఆడిషన్ చేశారు. కానీ సెలక్ట్ కాలేదు. సీరియల్, సినిమా అని కాదు.. నటన ముఖ్యం. అందుకే ఆడిషన్‌కు పిలిచానని అంత పెద్ద డైరెక్టర్ నాతో చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా, సీరియల్స్‌తోపాటు ఓటీటీల కోసం కూడా యాక్ట్ చేస్తున్నాను' అని చెప్పారు.