Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 70ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
'ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ మధ్యే ఈ సినిమా నుంచి విడుదలైన 'నాలో ఇన్నాళ్లుగా కనిపించని..' అంటూ సాగే డ్యూయెట్‌కి సైతం అద్భుత స్పందన లభించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అత్యద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. దినకర్, రమ్య బెహ్రా అదే స్థాయిలో ఆలపించడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్, సంగీతం: మణిశర్మ.