Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ఎంతకాలం సినీ రంగంలో కొనసాగుతానో నాకు తెలియదు. అయితే సినీ రంగం నుంచి తప్పుకోవాలని నా భర్త కోరిన మరుక్షణమే నటనకు గుడ్‌బై చెప్పేస్తాను.నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను' అని కాజల్ అగర్వాల్ చెప్పి అటు అభిమానుల్ని, ఇటు ప్రేక్షకుల్ని షాకయ్యేలా చేసింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా కాజల్ తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చి, భర్త గౌతమ్ కిచ్లూపై తనకున్న ప్రేమని, గౌరవాన్ని చాటుకుంది. చిరంజీవితో నటించిన 'ఆచార్య' సినిమా పూర్తి కావడంతో ప్రస్తుతం నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటోంది. అలాగే కమల్ సరసన 'ఇండియన్ 2' చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది.