Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాలు జరిగాయనే దానిపై సెక్షన్ 51 ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ,'సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరి రిపోర్ట్‌ని ఈనెల 3వ తేదీన సొసైటీ కమిటీకి అందజేశారు. సెక్షన్ 51 ఎంక్వైరి ప్రకారం రిపోర్ట్‌ని 30 రోజుల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులకు తెలియజేయాలి. అందుకే ఈ నెల 29న హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ మీటింగ్‌లో ఎంక్వైరీ కమిటీ రిపోర్టును సభ్యులకు తెలియజేస్తాం. ఈ మీటింగ్ తర్వాత చాలా విషయాలపై స్పష్టత వస్తుంది. అలాగే సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై సెక్షన్ 60 ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చింది ప్రాథమిక నివేదిక మాత్రమే. సెక్షన్ 60 ప్రకారం పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత వాస్తవంగా అన్ని విషయాలు తెలుస్తాయి. అంతవరకు ఎవరూ అనవసర ప్రచారాలు చేయవద్దు. ఆరోపణలపై వాస్తవాలు వెల్లడి అయ్యేంత వరకు అందరూ సంమయనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1600 కుటుంబాల ఆవేదనని అర్థం చేసుకుని, ప్రాజెక్ట్‌కు ఇబ్బంది కలగకుండా సహకరించాలని అందర్నీ కోరుతున్నాను' అని చెప్పారు.