Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్సేన్ హీరోగా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'పాగల్'. నరేష్ కుప్పిలి దర్శకుడు. సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర బృందం వైభవంగా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ, 'విశ్వక్ కెరీర్లో బెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని చెప్పారు. 'దిల్‌రాజు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. నేను గర్వపడే, మీరు ఇష్టపడే సినిమా చేశాను' అని నిర్మాత అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ కథ వినగానే కొత్తగా అనిపించి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యాను. విశ్వక్‌ని చూసి ప్రొడ్యూసర్‌గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నరేష్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఈనెల 14న వరల్డ్‌వైడ్‌గా థియేటర్స్‌లో విడుదలవుతోంది' అని అన్నారు.
'నరేశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ మూవీతో పెద్ద హిట్టు కొట్టబోతున్నాం. చాలా మంది ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్టా అని అడుగుతున్నారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేనే అడవికి వెళ్ళి ఆడుకునే టైపు. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేపిస్తా.. తప్పైతే నా పేరు మార్చుకుంటా' అని హీరో విశ్వక్సేన్ అన్నారు.