Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లో పలు ఆసక్తికరమైన అంశాలుండటం విశేషం.
అలాగే ఈ పోస్టర్ని చూసిన మహేష్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ ఖాయమంటూ ఖుషీ అయ్యారు. 'ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రాహకుడుగా మధీ, సంగీత ప్రపంచంలో సంచలనాలు సష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్న పూజాహెగ్డే మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?, అలాగే ఇతర వివరాలను త్వరలోనే మరో ప్రకటనలో తెలియపరుస్తాం. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటువంటి భారీ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రం పెద్ద హిట్ ఖాయం' అని చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత.