Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న నయా చిత్రం 'సర్కారువారి పాట'. శుక్రవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఓ భారీ సెట్లో ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కొంత టాకీ పార్ట్‌ని కూడా ఇక్కడ చిత్రీకరిస్తారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న విడుదల చేస్తున్నారు.