Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ని శుక్రవారం చిత్రబృందం అభిమానులతో షేర్ చేసుకుంది. ఈనెల 15న ఉదయం 9:45 గంటలకు ఈ చిత్ర టైటిల్, పవన్ కల్యాణ్ పాత్రకి సంబంధించి గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ, పవర్ స్ట్రోమ్ పేరుతో ఓ పోస్టర్ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో లుంగీ కట్టులో వెనక్కి తిరిగి ఉన్న పవన్ కళ్యాణ్ ప్రీ లుక్ అందరినీ అలరిస్తోంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. భీమ్లానాయక్‌గా పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకి జోడీగా ఐశ్వర్య రాజేష్ మెరవబోతోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.