Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. 'చిరు 153' అనేది వర్కింగ్ టైటిల్. చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో సినిమాని ఆరంభించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి, తమన్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిది. ఇప్పటికే తమన్ ఓ సాంగ్ కంపోజిషన్ని కూడా పూర్తి చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలు.