Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవన్, మధుప్రియ జంటగా సోమసుందరం బి.యం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శత్రుపురం'. శ్రీమతి పుష్పలత.బి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఫిలిం ఛాంబర్లో 'నాంది' చిత్ర నిర్మాత సతీష్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని చూస్తుంటే, ఇందులోని సీన్స్, లోకేషన్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. రియలిస్టిక్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం మా 'నాంది' కంటే పెద్ద హిట్ కావాలి' అని చెప్పారు. 'మా దర్శకుడు పెద్ద హీరో కోసం రాసుకున్న కథని నాతో సినిమాగా తీయటం ఆనందంగా ఉంది. ఇది నా రెండవ సినిమా. ఇందులోని యాక్షన్ సీన్స్‌తోపాటు సినిమా కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని చిత్ర హీరో జీవన్ అన్నారు.
చిత్ర దర్శకుడు సోమ సుందరం మాట్లాడుతూ, 'నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేశాం. ఒక ఊరిలో పైకి మంచిగా నటిస్తూ, ఎవరికీ తెలియకుండా అతి భయంకరంగా హత్యలు చేస్తున్న ముగ్గురు దుర్మార్గులను హీరో పసిగట్టి, వారిని ఎలా హతమార్చాడు అనేదే ఈ సినిమా కథ. అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది' అని తెలిపారు.