Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్‌కి కీర్తి-కాంత-కనకంలో ఏదో ఒకటి కచ్చితంగా కారణంగా నిలుస్తుందనే వాస్తవాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం'కె.3' (కీర్తి-కాంత-కనకం). సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్టైనర్ ఇది. 'మగువ' ఫేమ్ సురేష్ బాబు, 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' ఫేమ్ వశిష్ట చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాణిక్, శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ, సంధ్య, ప్రవీణ్ బాహు, రాజీవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత రొక్కం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,'ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం. కథే హీరో, విలన్ కూడా. దర్శకుడు ఆదిత్య వంశీ ప్రతి సీన్‌ని ఎంతో అద్భుతంగా, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాడు. సెన్సార్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఆదిత్య వంశీ దర్శకత్వం, చిన్నికష్ణ సంగీతం, రవి మాదగోని పాటలు, ఆరిఫ్ లలాని (మిణుగురులు ఫేమ్) ఛాయాగ్రహణం, నటీనటుల నటన ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. కంటెంట్ ఉండే సినిమాలకు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఈ కోవలోనే మా చిత్రాన్ని కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: మల్లి మాస్టర్, ఎడిటింగ్: సునీల్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఆదిత్య వంశీ.