Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడిగా, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రుహానీ శర్మ నాయికగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'మా చిత్రాన్ని తొలుత ఈనెల 27న విడుదల చేయాలనుకుని, విడుదల తేదీని కూడా ప్రకటించాం. అయితే అదే తేదిన మరికొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. ఎక్కువ సినిమాలు విడుదలైతే, నిర్మాతలే నష్టపోవాల్సి ఉంటుంది. అలా జరగకుండా అందరూ బాగుండాలనే సదుద్దేశంతో మా చిత్రాన్ని సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ నటన అందరినీ అలరిస్తుంది. అలాగే తనదైన కామెడీ పంచులతో ప్రేక్షకులు ఎంజారు చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథనీ అందించారు. ఈ సినిమాకి సంబంధించిన వీడియో ప్రోమో, టీజర్, టైటిల్ సాంగ్‌తో పాటు 'మనసా వినవా..' లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది' అని చెప్పారు.