Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునైన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'రాజ రాజ చోర'. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 19న విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా కథానాయిక సునైన శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇందులో విద్య అనే లాయర్ పాత్రలో నటించా. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర.
లాయర్ పాత్ర అంటే కేసుల విషయంలో వాదోపవాదాలు చేయాలి. కానీ నిజ జీవితంలో నేను ఆర్గ్యూమెంట్స్కి చాలా దూరం.
చాలా కామ్‌గా ఉంటాను. అయితే నా పాత్ర తీరుతెన్నుల విషయంలో దర్శకుడు చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. దీంతో నా పాత్రకి పూర్తి న్యాయం చేశా. అలాగే నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. అయితే సెకండ్ వేవ్ కారణంగా కొంత పార్ట్‌ని వేరే వారితో చెప్పించారు. నా పాత్రతో పాటు ఇతర పాత్రలు కూడా చాలా రియల్‌గా ఉంటాయి. ఇదొక ఎంటర్టైనింగ్ మూవీ. ముఖ్యంగా సిట్చ్యువేషనల్ కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉంటారు. శ్రీ విష్ణు, మేఘా ఆకాష్‌తో నటించిన సన్నివేశాలు అందరినీ అలరిస్తాయి. చాలా కాలం తర్వాత ఇంత మంచి తెలుగు సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. 'టెన్త్‌క్లాస్' తర్వాత తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి.
దీంతో తెలుగు సినిమాలకు దూరమయ్యాను. ఈ సినిమాతో మళ్ళీ తెలుగునాట మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాని నిర్మాతగా నిర్మిస్తున్న 'మీట్ క్యూట్' యాంథాలజీలో నటిస్తున్నాను. మంచి పాత్రలు లభిస్తే తెలుగు, తమిళంలో కాదు బాలీవుడ్‌లోనూ నటించడానికి రెడీగా ఉన్నాను' అని తెలిపారు.