Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శకుడు అనిల్ రావిపూడి
'6 టీన్స్' హీరో రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కళాకార్'. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. శ్రీను బందెల దర్శకుడు. ఈ చిత్ర మోషన్‌పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్‌రావిపూడి రిలీజ్ చేసి, ప్రేక్షకుల్ని మెప్పించే 'కళాకార్' అంటూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మహేంద్ర వర్మగా రోహిత్ కనిపించనున్నట్లు మోషన్‌పోస్టర్ ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. క్రియేటివ్‌గా, స్టైలిష్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా చాలా ఫిట్‌గా ఉన్నావని నా ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్ చేసి ప్రశంసించారు. ఇప్పుడు మా చిత్ర మోషన్‌పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అని అన్నారు.'మేం అడిగిన వెంటనే మోషన్ పోస్టర్ని విడుదల చేసిన అనిల్ రావిపూడిగారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం తెలిపారు. దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ, 'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే టీజర్ విడుదల చేస్తాం' అని అన్నారు.
షాయాజీ షిండే, పథ్విరాజ్, రాజీవ్‌కనకాల, శివశంకర్, రవికాలే, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: అమర్ జి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: చిన్నా, సంగీతం: కనిష్క, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివారెడ్డి జాజాపురం.