Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్ బాబు హీరోగా కె.ఎస్.క్రియేషన్స్ పతాకంపై డి.వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బజార్ రౌడీ'. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబుకి జోడీగా మహేశ్వరి వద్ది నటిస్తున్నారు. దీనికి సహ నిర్మాత శేఖర్ అలవలపాటి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'మా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి 'యు' సర్టిఫికేట్ ఇచ్చి, పెద్దలు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా హాయిగా ఈ సినిమా చూడొచ్చంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకోవడం ఖాయం. ఈ చిత్ర కథకి సంపూర్ణేష్‌బాబు స్టైల్‌ని యాడ్ చేసి, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగేశ్వరావు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 20న విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ, 'వినోదంతోపాటు పాటలు, ఫైట్స్ ఇలా.. అన్ని ప్రేక్షకులకు కిక్కిచ్చే హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫస్ట్‌కాపీ చూసిన మా నిర్మాత చాలా ఆనందంగా ఉన్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారంటే సంపూర్ణేష్ బాబుకి చెప్పలేనంత అభిమానం. అందుకే ఆయన పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం మరింత సంతోషంగా ఉంది' అని అన్నారు.