Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, ఆనంది నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. కరుణ కుమార్ దర్శకుడు. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే మా సినిమాకు దేశవ్యాప్తంగా హై రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ మా చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న మా సినిమాను సాధ్యమైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు లక్ష్మణ్ గారు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ 'జాతి రత్నాలు' చిత్రాన్ని కూడా లక్ష్మణ్గారే డిస్ట్రిబ్యూట్ చేశారు. మంచి అంచనాలతో భారీ స్థాయి థియేటర్లలో మా చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పారు.
'సుధీర్‌బాబు కెరీర్లో ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయే 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్ర థియేట్రికల్ రైట్స్‌ని మాకు ఇచ్చిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మంచి కంటెంట్‌తో ఆద్యంతం వినోదభరితంగా, ఆసక్తికరంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇందులో సుధీర్‌బాబు, ఆనంది మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అలాగే దర్శకుడు కరుణకుమార్ తనదైన మార్క్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయనకు ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం. సుధీర్‌బాబు ఫ్యాన్స్‌తోపాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల భారీ కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉన్నాయి' అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ అన్నారు.
పవెల్ నవగీతమ్, నరేష్, రఘుబాబు, అజరు, సత్యం రాజేష్, హర్షవర్ధన్, సప్తగిరి, కళ్యణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్, సంగీతం: మణిశర్మ, ప్రోడక్షన్ డిజైనర్స్ : రామకష్ణ- మౌనిక, కథ : నాగేంద్ర కాషా, రచన-దర్శకత్వం: కరుణ కుమార్.