Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధర సమస్యాత్మకం మారింది. అలాగే సవరించిన ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి. గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అయితే ఈ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవితోపాటు పలువురు సినీ పెద్దలు త్వరలోనే భేటీ కాబోతున్నారు. ఈ విషయమై శనివారం ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా చిరంజీవికి ఫోన్ చేసి, ప్రస్తుత సమస్యలను కూలంకషంగా సీఎం జగన్‌కు వివరించాల్సిందిగా కోరారు.
ఈ కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బతుకు తెరువుతో సహా పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. గతంలో జరిగిన భేటీలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్‌బాబు బృందం పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా, వాటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. అలాగే ఈనెలాఖరున జరగబోయే భేటీలో సైతం సమస్యలన్నింటికి ఏపీ సీఎం తక్షణ పరిష్కారం చూపిస్తారని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా టిక్కెట ధర విషయంలో పరిష్కారం లభిస్తే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లుకు తద్వారా ఈ రంగాలపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ మంచి జరిగే అవకాశం పుష్కలంగా ఉంది.