Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బుజ్జి ఇలా రా'. సైకలాజికల్ థ్రిల్లర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. చాందిని అయ్యంగార్ హీరోయిన్.
రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి.నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో సీఐ కేశవ్ నాయుడుగా నటిస్తున్న ధన్‌రాజ్ క్యారెక్టర్ లుక్‌ను హీరో సందీప్ కిషన్ రిలీజ్ చేేశారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా ధన్‌రాజ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఈ లుక్ చూస్తే అర్థమవుతుంది. గరుడవేగ అంజి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూనే, సినిమాటో గ్రాఫర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించడం ఓ విశేషమైతే, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భాను, నందు మాటలు రాస్తున్నారు.