Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో ప్రముఖ నటులు, స్వర్గీయ డాక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ వేడుకలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు ఎన్. శంకర్, చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి, కూతుళ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినీ కార్మికుల అభివద్ధికి అలనాటి మేటి నటుడు ప్రభాకర్ రెడ్డి చేసిన కషిని అతిథులు కొనియాడారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ,' ప్రభాకర్ రెడ్డిగారి వల్లే ఈరోజు సుమారు నాలుగున్నర వేల కుటుంబాలకు నివాస సౌకర్యం ఏర్పడింది. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుత కమిటీ పనిచేస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మిగిలిన నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఆ గహ ప్రవేశాలు జరిగే రోజున ప్రభాకర్ రెడ్డిగారి కాంస్య విగ్రహాన్ని చిత్రపురిలో ఎత్తైన స్థలంలో ఏర్పాటు చేస్తాం' అని చెప్పారు.