Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశోక పిక్చర్స్ బ్యానర్ పై అమర్నాథ్ రెడ్డి గుంటకని డైరెక్టర్గా పరిచయం చేస్తూ ఆర్.కె.రెడ్డి నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న చిత్రం 'గగన వీధి'.
ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో యువత తలుచుకుంటే, ఏదైనా సాధించగలదు అనే చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 'మెయిల్' ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా, సింధూరపువ్వు రాంఖీ, 'సినిమా బండి' ఫేమ్ వికాస్ వశిష్ఠ, 'నారప్ప' ఫేమ్ రాఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు' అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత : ఆర్.కె.రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ చరణ్ పాకాల, మాటల రచయిత : ఐ.రవి, డి.ఓ.పి : జి.ఎల్.ఎన్.బాబు.