Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వంగవీటి, 'జార్జిరెడ్డి' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు సందీప్‌మాధవ్. ఆయన హీరోగా గాయత్రి ఆర్.సురేష్, శీతల్ భట్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి ఓ డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు అప్సర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్లో సందీప్ మాధవ్ కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది' అని మేకర్స్ తెలిపారు.