Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద బోతోంది. విజన్ సినిమా బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపార వేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం టి.ఎం.కె అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై, పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిరుమల్ రెడ్డి యెల్లా.