Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్'. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్‌ను రిలీజ్ చేేశారు. ఈ సందర్భంగా...నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ, 'శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర ఇలా అందరూ అద్భుతంగా నటించారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని, శ్రీను పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'మా సినిమా రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, దిల్‌రాజుకి స్పెషల్ థ్యాంక్స్' అని మరో నిర్మాత శ్రేయాస్ శ్రీను చెప్పారు. ఇంకొక నిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ, 'మంచి వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే దాన్ని సరదా కాన్సెప్ట్‌తో చేశాం. శ్రీముఖి గ్లామర్, ఎనర్జీ, నటన సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. బండ్ల గణేష్ రియల్ క్యారెక్టర్ని చేశారు' అని అన్నారు. ' మా క్రేజీ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందో తెలుసుకోవాలంటే ఈనెల 19న థియేటర్స్‌లో కలుద్దాం' అని డైరెక్టర్ సత్తిబాబు అన్నారు.