Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి.సెల్యూలాయిడ్, ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'సో..సో..గా ఉన్నాననే.. సో.. స్పెషలే చేశావులే..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను యువ కథానాయకుడ సాయితేజ్ సోమవారం రిలీజ్ చేశారు. ఈ పాటకు సర్వత్రా మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ,'ఇప్పటికే విడుదలైన
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు క్యారెక్టర్ ఇంట్రో వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్గా ఈ మూవీ అల్బమ్ నుంచి ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'సోసోగా..' ఉన్న పాట తాజాగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ట్యూన్స్, కేకే లిరిక్స్ వెరసి ఈ పాటను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్ళాయి. ఈ పాట లిరికల్ వీడియోలో ఉన్న కొన్ని కలర్‌ఫుల్ విజువల్స్, హీరో, హీరోయిన్‌తో యష్ మాస్టర్ వేయించిన అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ ఈ పాటకు బాగా హైలైట్ అయ్యాయి. మారుతి, యూవీ, ఎస్కెఎన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో రాబోతున్న ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది' అని చెప్పింది. 'ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. తాజాగా హీరో సాయితేజ్ రిలీజ్ చేసిన 'సో..సో..గా..' పాట అందర్నీ విశేషంగా అలరించడం హ్యాపీగా ఉంది. త్వరలోనే భారీ రేంజ్లో థియేట్రికల్ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది ' అని నిర్మాత ఎస్.కె.ఎన్. తెలిపారు.