Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా రూపొందిన చిత్రం 'చేరువైన.. దూరమైన'. వినాయక ఎంటర్టైన్మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ, 'నన్ను, నా కథని నమ్మి నిర్మాతలు ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు' అని చెప్పారు.
'దర్శకుడు చంద్రశేఖర్ తాను చెప్పిన కథని బాగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఇష్టపడతారు' అని నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి అన్నారు. హీరో సుజిత్ మాట్లాడుతూ, 'కొత్త హీరో అయినా కూడా నిర్మాతలు నన్ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఈ చిత్ర టీజర్‌ను గోపీచంద్ మలినేని లాంచ్ చేేసి ఆశీర్వదించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ట్రైలర్ రిలీజ్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.