Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'రాజ రాజ చోర'. మేఘా ఆకాష్, సునైన కథానాయికలు. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఆదివారం జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి, నారా రోహిత్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, 'సినిమాకు మూడు మాస్కులతో వెళ్లండి. ఎందుకంటే తొలి ముప్పై నిమిషాల్లో నవ్వి నవ్వి మీ మాస్కులు ఎగిరిపోతాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోద్ది. ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తాం. సినిమాలో ఎంత నవ్వులుంటాయో, అంతే ఎమోషన్స్ ఉంటాయి. హండ్రెడ్ పర్సెంట్ ఇదొక ప్రయోగాత్మక చిత్రమిది. ఇలాంటి సినిమాలో నేను యాక్ట్ చేశానని గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమాను కచ్చితంగా ప్రతి లాంగ్వేజ్‌లో రీమేక్ చేస్తారనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
'ఇప్పటి వరకు విష్ణు చేసిన సినిమాల్లో కనిపించిన కొంటె విష్ణు కన్నా, పదిరెట్లు ఎక్కువగా కనిపిస్తాడు. సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది' అని చిత్ర దర్శకుడు హసిత్ గోలి చెప్పారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నారా రోహిత్, డైరెక్టర్ బాబి, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, పవన్ సాధినేని, తేజ మార్ని, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, బెజవాడ ప్రసన్న తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.