Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వి.జె.సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'సకల గుణాభి రామ'. ఇ.ఐ.పి.ఎల్ పతాకంపై వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో వి.జే సన్నీ మాట్లాడుతూ,'మంచి కథ ఉన్న సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ సంగీతం అద్భుతంగా ఉంటాయి. ఇందులోని ఒక పాట ఈ ఇయర్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. నిర్మాత సంజీవ రెడ్డి ఖర్చుకి వెనకాడకుండా సినిమాని పూర్తి చేశారు. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని చెప్పారు.
'సకల గుణాలు కలిగిన రాముడు అయినా భర్త, అతని భార్య మధ్య ఎమోషన్స్ రొమాన్స్, కామెడీనే ఈ సినిమా' అని దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ అన్నారు. నిర్మాత సంజీవ రెడ్డి మాట్లాడుతూ,' దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ చెప్పిన కథ చాలా డిఫరెంట్గా అనిపించి, ఈ సినిమా చేశాను. సినిమా బాగా వచ్చింది. చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు.