Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడనాట 'దియా' (లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్) పేరుతో విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్లో క్లాప్ బోర్డ్స్ ప్రొడక్షన్స్, విభ కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్కే నల్లం, రవి కశ్యప్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఖుషి, దీక్షిత్, పధ్వీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అశోక్ కె.ఎస్ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కో- డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, 'డెస్టినీ.. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమని ఎలా మార్చింది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన అందమైన ప్రేమకావ్యం 'దియా'. కన్నడ కంటే తెలుగు అవుట్‌ఫుట్ బాగా వచ్చింది. ఈ సినిమా అందరినీ కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. '10 రోజుల గ్యాప్‌తో 'ముగ్గురు మొనగాళ్ళు', 'దియా' బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాకి గొప్ప విజయాన్ని అందించారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను' అని హీరో దీక్షిత్ అన్నారు. హీరోయిన్ ఖుషి మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ సినిమా. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా.. అన్ని విభాగాల్లో ఈ సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు.