Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న చిత్రం 'కె.3' (కీర్తి-కాంత-కనకం). 'మగువ' ఫేమ్ సురేష్ బాబు, వశిష్ట చౌదరి (ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫేమ్) జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ మంగళవారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో ఘనంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి, ట్రైలర్లో సక్సెస్ కళ చాలా స్పష్టంగా కనిపిస్తోందని చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. కథే హీరో, విలన్. యూనిట్ సభ్యుల సహాయ సహకారం, సముద్ర గారి మార్గదర్శకత్వంలో, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించాం. సెన్సార్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. చిన్నికష్ణ సంగీతం, రవి మాదగోని పాటలు, ఆరిఫ్ లలాని ఛాయాగ్రహణం, ఆర్టిస్ట్ల నటన ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. కంటెంట్ ఉండే సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అలాగే మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని చెప్పారు.