Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కనబడుటలేదు'. బాలరాజు.ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కథానాయిక వైశాలి రాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ,'ఇప్పటివరకు ఐదారు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాను. అలాగే 'మౌన రాగం' సీరియల్లో నెగటివ్ రోల్ చేశాను. హీరోయిన్గా ఇది నా తొలి చిత్రం. నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్, కానీ నా అసలు పేరు కవిత. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిలర్. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇది ది బెస్ట్ అని చెప్పగలను. కచ్చితంగా ఆడియెన్స్‌కు నచ్చుతుంది. సునీల్‌గారితో నటించడం హ్యాపీగా అనిపించింది. కథాపరంగా ఈ సినిమా నా చుట్టూనే రన్ అవుతుంది. మిడిల్ క్లాస్ పక్కింటి అమ్మాయి పాత్రలో నటించాను. నా పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.నటనకు మంచి స్కోప్ ఉన్న ఈ సినిమా నాకు మరిన్ని అవకాశాల్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం కొన్ని కథలు విన్నా. హీరోయిన్గా మాత్రమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్ర ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే డైరెక్షన్ చేయాలని ఉంది. దీపికా పదుకొనె, నయనతార, సమంత అంటే చాలా ఇష్టం. వాళ్లు సెలక్ట్ చేసుకునే రోల్స్ నాకు బాగా నచ్చుతాయి' అని తెలిపింది.