Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునైన హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ, 'నేను, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చిన్నప్పట్నుంచి స్నేహితులం. ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశాం. మేం చేసిన షార్ట్ ఫిల్మ్స్‌కు మంచి అప్రిషియేషన్ రావడంతో వివేక్కి 'మెంటల్ మదిలో' సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ టైమ్‌లో నేను జాబ్ చేస్తున్నా. అయితే నేను కూడా డైరెక్టర్ అవ్వాలని జాబ్‌ని వదిలేశా. 'మెంటల్ మదిలో' తర్వాత నేను ఓ కథను శ్రీవిష్ణుకి చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకా బెటర్ లైన్ ఐడియాలోకి రావడంతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం. పాజిటివ్ క్యారెక్టర్ కంటే గ్రేషేడ్స్ ఉన్న పాత్రల్లో కొంచెం డ్రామా ఎక్కువగా ఉంటుందనేది నా అభిప్రాయం. దాన్ని హిలేరియస్ జోనర్ చూపించాలని అనుకున్నాను. నాకు శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. దాన్ని పూర్తి స్థాయిలో ఎవరూ చూపించలేదు.ఈ సినిమాలో దాన్ని చూపించబోతున్నా. ఓ దొంగ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనే కోణాన్ని కామెడీ కోణంలో చూపించే ప్రయత్నమిది. సినిమాలో కిరీటం కూడా ఓ కీ రోల్‌ని ప్లే చేస్తుంది. అదేంటనేది సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది' అని అన్నారు.