Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమీందార్లు, దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్ ఆఫ్ గోల్కొండ' ( సర్దార్ సర్వాయి పాపన్న). ఈ చిత్ర లోగో ఆవిష్కరణ బుధవారం ఫిలించాంబర్లో పర్యాటక శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఆర్.కె. ఫిలింస్ పతాకంపై డా.ప్రతాని రామకష్ణ గౌడ్ దర్శకత్వంలో పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, '33 కోటలను జయించి గొల్కొండపై విజయకేతనాన్ని ఎగుర వేసిన మహనీయుడు సర్వాయి పాపన్న పై ప్రతాని రామకష్ణ సినిమా చేయడం చాలా సంతోషం. ఇదొక గొప్ప వీరుని కథ అందరికీ తెలిసే విధంగా, అంతే గొప్పగా తీయాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'విస్మరణకు గురైన పాపన్న చరిత్రను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం. ఎక్కడా కల్పితాలు లేకుండా వాస్తవికంగా 50 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం' అని దర్శకుడు ప్రతాని రామకష్ణ గౌడ్ చెప్పారు. నిర్మాత పల్లె లక్ష్మణరావు మాట్లాడుతూ, 'ఒక గొప్ప వీరుడు చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించడం గర్వంగా ఉంది' అని అన్నారు. 'నన్ను నమ్మి సర్దార్ సర్వాయి పాపన్న పాత్ర నాతో చేయిస్తున్న ప్రతాని గారికి ధన్యవాదాలు. ఈ పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను' అని హీరో వంశీ అన్నారు.