Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమెడియన్‌గా తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించి, 'కలర్ ఫొటో' చిత్రంతో హీరోగా సక్సెస్ అందుకున్నారు సుహాస్. త్వరలోనే 'రైటర్ పద్మభూషణ్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుహాస్ పుట్టినరోజు నేడు (గురువారం).
ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి మీడియాతో సుహాస్ మాట్లాడుతూ, 'ఈ బర్త్ డే నాకు చాలా స్పెషల్. ఇండిస్టీలో నాని, విజరు దేవరకొండ, శివ నిర్వాణ, నాగచైతన్య, సమంత, బ్రహ్మాజీ.. ఇలా అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక నా తల్లిదండ్రులు, భార్య, స్నేహితులు సైతం అండగా నిలబడ్డారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నేను 'కలర్ ఫోటో'తో హీరో అయ్యా. అయితే హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా మంచి కథలు, పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఆరు సినిమాల్లో ఐదింటిలో లీడ్ క్యారెక్టర్‌గా, మరో సినిమాలో నార్మల్ క్యారెక్టర్ చేస్తున్నాను. డైరెక్టర్ ప్రశాంత్ నా షార్ట్ ఫిల్మ్స్‌కు రైటర్‌గా, 'కలర్ ఫొటో' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేశాడు. తను చెప్పిన 'రైటర్ పద్మభూషణ్' కథ నాకు బాగా నచ్చింది. దాని గురించి ఛారు బిస్కట్ ప్రొడక్షన్ వారితో చెప్పాను. మంచి కథను ఇంకా బాగా ఎలివేట్ చేద్దామంటూ మంచి బడ్జెట్‌తో, ఆర్టిస్టులతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయవాడలోని ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఏం జరుగుతుందనేదే ఈ కథ. ప్రశాంత్ డైలాగ్స్ బాగా రాశాడు. ఇందులో నా పాత్ర కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్‌లో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు' అని చెప్పారు.