Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'రాజ రాజ చోర'. హిసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ,' నా కెరీర్‌కి సంబంధించి వెంకటేష్‌గారు మంచి సలహాలు ఇస్తుంటారు. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో నా సినిమాని ఆయన సినిమాతో కంపేర్ చేయటానికి కారణం కూడా ఇదే. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుంటారు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి, ఉత్సాహం రావడానికి ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడాను. నా అదష్టం కొద్దీ చేస్తున్న సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంలో ఉంటున్నాయి. ఆ పాత్రలు మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.ఇది చాలా మంచి కథ. కొత్త రకమైన స్టోరి టెల్లింగ్. బయటి లాంగ్వేజ్ చిత్రాలను ఓటీటీల్లో చూసి వాళ్లని పొగుడుతున్నాం కదా, అలా రేపు మీరు కూడా మమ్మల్ని పొగుడుతారు. ఈ జోనర్లో డిఫరెంట్ అటెంప్ట్. కొంటె దొంగ పాత్ర చేశాను. సినిమాలో క్యారెక్టర్స్ ప్రేక్షకులకు అర్థం కావడానికి పదిహేను నిమిషాల సమయం పడుతుంది. వెళ్లిన తర్వాత హీరో పాత్రను అందరూ ఇష్టపడతారు. సినిమాలో సిట్చ్యువేషనల్ కామెడీ ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో చెప్పేవన్నీ అబద్దాలే. హసిత్ దీన్ని బాగా తెరకెక్కించాడు. ఈ సినిమా చూసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించే అందరూ మాట్లాడతారు. మేఘా ఆకాష్, సునైనాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందనడంలో సందేహం లేదు. నెక్ట్స్ చేస్తున్న 'అర్జున ఫాల్గుణ'లో ఓ సాంగ్ మాత్రమే బాలెన్స్ ఉంది. అలాగే 'భళా తందనాన' షూటింగ్ జరుగుతోంది. వీటితోపాటు ఓ పోలీస్ సినిమా చేస్తున్నాను. నేను ఏ సినిమా చేసినా భిన్నంగా ఉండేలా చూసుకుంటాను. సీనియర్ దర్శకులతో కంటే కొత్త దర్శకులతోనే సినిమా చేయటానికి ఇష్టపడతా' అని చెప్పారు.