Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్. నెం.2గా కష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కష్ణ దర్శకుడు. గురువారం హైదరాబాద్‌లో పూజతో ఈ సినిమా ఆరంభమైంది.
తొలి షాట్‌కు దిల్‌రాజు క్లాప్‌కొట్టగా, దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేేసి, గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ కొరటాల శివ, ఫైనాన్సియర్ ఎంఆర్విఎస్.ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శకుడు వి.వి.గోపాలకష్ణకు అందించారు. 'ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మరో సరికొత్త పాత్రలో సత్యదేవ్ మెప్పించనున్నారని కాన్సెప్ట్ పోస్టర్ చెప్పకనే చెప్పింది. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్న సత్యదేవ్ తన 25వ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు?, అలాగే ఇప్పటి వరకు ఏ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించని దర్శకుడు కొరటాల శివ తొలిసారి ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.