Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో, ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథాకధనంతో తెరకెక్కుతున్న చిత్రం '105 మినిట్స్'. హన్సిక మోత్వాని కథానాయిక. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది.
ఈ సందర్భంగా బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ, 'మేము అనుకున్న కాన్సెప్ట్‌ను అనుకున్నట్టుగా చాలా చక్కాగా తీశాం. రవి నాకు అన్ని విభాగాల్లోనూ చాలా సపోర్ట్ చేశారు. చిత్రీకరణ ప్రారంభం నుంచి అయిపోయే వరకు హన్సిక బాగా కష్టపడింది. ప్రతి షాట్ ఇరవై ఐదు నిమిషాలు ఉన్నా కూడా కాదనకుండా చేసింది. మేము సింగిల్ షాట్లో చేస్తే హన్సిక ప్రతి షాట్‌ని సింగల్ టేక్‌లో చేశారు. అందుకే సినిమాని తొందరగా పూర్తి చేయగలిగాం' అని చెప్పారు. హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ,' నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా టఫ్‌గా అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ అనుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అంత సులభం కాదు. అలాంటిది సినిమాపై మంచి ప్యాషన్ ఉన్న దర్శక,నిర్మాతలు ఈ చిత్రాన్ని అతికొద్ది సమయంలోనే పూర్తి చేయటం హ్యాట్సాఫ్' అని అన్నారు. 'అందరి సహకారంతో ఈ సినిమాని కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేశాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని నిర్మాత బొమ్మక్ శివ చెప్పారు.ఈ చిత్రానికి డిఓపి : కిషోర్ బొయిదాపు, మ్యూజిక్ : సామ్ సి.యస్, ఆర్ట్ : బ్రహ్మ కడలి.