Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్ మేఘ'. అర్జున్ సోమయాజుల కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు.
విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ, 'సినిమా రెడీగా ఉన్నా, థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేశార. ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో మా చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్యూర్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు సుశాంత్ రెడ్డి తెరకెక్కించారు. ఈ భావోద్వేగ ప్రేమకథలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల నటన ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది. ఈ సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్‌ను ఆడియెన్స్‌కు కలిగిస్తుందనే నమ్మకం ఉంది. హరి గౌర కంపోజ్ చేసిన ఈ చిత్రంలోని పాటలు హిట్ అయ్యాయి. అలాగే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది' అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : ఐ ఆండ్రూ, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : పీఎస్ వర్మ, రచన - దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.