Authorization
Mon Jan 19, 2015 06:51 pm
20 ఏళ్ళ కుర్రాడిగా పార్వతీశం, 60 ఏళ్ళ పెద్దావిడగా శ్రీలక్ష్మి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంతో చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని బుధవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
'హీరోకి ఎంత వయసు వచ్చినా యువకుడిలా ఉంటున్నాడు. అయితే, అతడు యువకుడిలా ఉండటానికి గల రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రమిది. సత్య కశ్యప్ చక్కటి బాణీలు ఇచ్చారు. ఇందులోని మూడు పాటలు అందరినీ అలరిస్తాయి. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేస్తాం' అని దర్శకుడు చైతన్య కొండ అన్నారు.
నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ, 'సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. పార్వతీశం, శ్రీలక్ష్మి జంట నవ్వులు పూయిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది' అని చెప్పారు.
శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: మహేష్, నేపథ్య సంగీతం: మహిత్ నారాయణ, స్వరాలు: సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల.