Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్స్‌లో విడుదల కానుంది. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర హీరో మహేష్‌బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ,'యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉన్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 'శ్రీదేవి నాది.. నాదే..', 'నా శ్రీదేవికి పెళ్లి చేస్తార్రా..?' అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగులకు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ని ఫాన్సీ ప్రైస్‌కి తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాను భారీ రిలీజ్‌కి లక్ష్మణ్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.