Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ, యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'తమిళంలో ఆర్. పార్తిబన్ స్వీయ దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'. పార్తిబన్కి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం బండ్ల గణేష్ మేకోవర్ అవుతున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇదే చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు' అని దర్శక, నిర్మాతలు అన్నారు.