Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అందమైన లోకం'. మోహన్ మర్రిపెల్లి దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్నారు. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా వైభవంగా ప్రారంభమైంది. హీరో,హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి చిత్ర నిర్మాత కూతురు సహస్ర క్లాప్‌నివ్వగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. మంచి మెసేజ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది' అని తెలిపారు. నిర్మాత డాక్టర్ రవీంద్ర నాయుడు మాట్లాడుతూ,'దర్శకుడు చెప్పిన కథ విని బాగా ఎగ్జైట్ అయ్యాను. స్క్రిప్ట్‌ని అద్భుతంగా తయారు చేసుకుని, సినిమాని ఆరంభించాం' అని తెలిపారు.