Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'రాజ రాజ చోర'. గురువారం విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్టాక్తో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల మీడియాతో మాట్లాడుతూ, 'వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల నుంచి యునామినస్గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తప్పకుండా ఈ మూడు రోజుల్లో పెద్ద నంబర్స్ రాబోతున్నాయని నమ్ముతున్నాం. కోవిడ్ లేకుంటే కలెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వచ్చేవి. ఆంధ్రాలో ఫిఫ్టి పర్సెంట్ ఆక్యుపెన్సీ, టికెట్ రేట్లు కూడా తక్కువ.ఈ పరిస్థితుల్లోనే ఇంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటే సాధారణ పరిస్థితుల్లో చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యుండేది. అయినప్పటికి ఈ సక్సెస్‌ని ఎంజారు చేస్తున్నాం. దర్శకుడు హసిత్ గోలి అద్భుతంగా తీశాడు. ఈ కథకి సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. దీంతో సినిమా ప్రజెంటేషన్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. ఇక మా బ్యానర్లో కళ్యాణ్ దేవ్, శ్రీధర్ సీపానతో ఓ సినిమా, 'కార్తికేయ 2', 'గూఢచారి 2' సినిమాలు చేస్తున్నాం' అని చెప్పారు.