Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మధుర వైన్స్'. జయ కిషోర్ బండి దర్శకుడు. ఆర్.కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మిస్తున్నారు.
విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ''గతం', 'తిమ్మరుసు' వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సజన్ ఎరబోలు. ఆయన అసోసియేట్ అవ్వడంతో ఇండిస్టీలో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి 'అద్భుతం', 'పంచతంత్రం' కూడా రాబోతున్నాయి. 'మధుర వైన్స్' సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఆహ్లాదకరంగా ఉండే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.